కిలో గంజాయి పట్టివేత

గంజాయి కలిగి ఉన్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై రవి కిరణ్ తెలిపారు.

Update: 2025-01-05 13:27 GMT

దిశ,పెగడపల్లి : గంజాయి కలిగి ఉన్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై రవి కిరణ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నరసింహుని పేట గ్రామంలో నిర్మానుష్య ప్రాంతంలో గంజాయి తో నలుగురు వ్యక్తులు ఉన్నారన్న సమాచారం మేరకు రెక్కీ నిర్వహించగా గంజాయితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.

     వీరిలో ముగ్గురు మండల కేంద్రానికి చెందిన వారు కాగా మరొకరు కొత్తపల్లి కరీంనగర్ కి చెందిన వారని, వారి నుండి సుమారు రూ.25 వేల విలువ గల కిలో గంజాయితో పాటుగా మూడు సెల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిషేధిత గంజాయి కలిగి ఉన్న వ్యక్తులను చాకచక్యంగా పట్టుకున్న ఎస్సై రవి కిరణ్, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రఘు చందర్, సీఐ నీలం రవి అభినందించారు. 


Similar News