ఇన్ఫార్మర్ నెపంతో యువకుని హత్య
ఛత్తీస్గడ్ కాంకేర్ జిల్లా టేకా మేట గ్రామానికి చెందిన సురేష్ మట్టమి అనే యువకుడిని ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు హత్య చేశారు.
దిశ, భద్రాచలం : ఛత్తీస్గడ్ కాంకేర్ జిల్లా టేకా మేట గ్రామానికి చెందిన సురేష్ మట్టమి అనే యువకుడిని ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు హత్య చేశారు. ఛత్తీస్గడ్ రాష్ట్రంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య సామాన్య గిరిజనం నలిగిపోతుంది. ఈ మధ్యకాలంలో మావోయిస్టులు సుమారు 30 మందిని పోలీసులకు సహకరిస్తున్నారనే నెపంతో హత్య చేశారు.