ఇకనుంచి తెలంగాణలో ఆ మాట వినపడొద్దు.. CM రేవంత్ సంచలన ఆదేశాలు

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం(Secretariat)లో ఆర్‌ఆర్‌ఆర్‌(RRR), అర్‌అండ్‌బీ(R&B), నేషనల్‌ హైవే ప్రాజెక్టు(National Highway Project)లపై శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్షా సమావేశం నిర్వహించారు.

Update: 2025-01-03 14:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం(Secretariat)లో ఆర్‌ఆర్‌ఆర్‌(RRR), అర్‌అండ్‌బీ(R&B), నేషనల్‌ హైవే ప్రాజెక్టు(National Highway Project)లపై శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్షా సమావేశం నిర్వహించారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు(Regional Ring Road)కు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. నాగ్‌పూర్‌ – విజయవాడ కారిడార్‌(Nagpur – Vijayawada Corridor)కు సంబంధించి తెలంగాణ జిల్లాల్లో అసంపూర్తిగా మిగిలిన భూసేకరణ ప్రక్రియను సంక్రాంతిలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అటవీ శాఖ పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

అటవీ, ఆర్అండ్‌బీ శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. అటవీశాఖ పరిధిలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు ఉండాలని.. విడతల వారీగా నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక తెలంగాణ ఏ గ్రామానికి రోడ్డు లేదనే మాట వినపడొద్దని సూచించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రోడ్డు వెడల్పు ఉండే విధంగా డిజైన్ చేయాలన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komati Reddy Venkat Reddy), ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), కొండా సురేఖ, సీతక్క, సీఎస్‌ శాంతికుమారి, ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. 

Tags:    

Similar News