Chandrababu: కొందరు కోట్లు సంపాదిస్తే మరి కొందరు పేదలుగా మారుతున్నారు: చంద్రబాబు
చంద్రబాబు నాయుడు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు, శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకు తెలుగువారు ఎక్కడున్నా ఒకటే అని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. శుక్రవారం హైదరాబాద్ హెచ్ఐసీసీలో (Hyderabad HICC) అంతర్జాతీయ తెలుగు మహాసభలు (World Telugu Federation Conference) ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. బ్రెయిన్ డ్రెయిన్.. బ్రెయిన్ గెయిన్ అవుతుందని తాను ఆనాడే చెప్పానని ఆ రోజు నేను చెప్పింది ఇవాళ నిజమైందన్నారు. ఈ ప్రాతం గొప్ప ఐటీ సిటీగా మారుతుందని ఆనాడే ఊహించానని విజన్ 2020 తయారు చేసుకుని ఆనాడు ముందుకు వెళ్లామన్నారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. ఏఐ, డీప్ టెక్నాలజీని తెలుగువాళ్లు అందిపుచ్చుకోవాలన్నారు.
పేద వాళ్లు పేదవారిగానే మారుతున్నారు:
వికసిత్ భారత్ కోసం ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) విజన్ 2047 తయారు చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. 2047 నాటికి భారత దేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉంటుంది. ఏఐ, డీప్ టెక్నాలజీని తెలుగువాళ్లు అందిపుచ్చుకోవాలి. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. పెట్టుబడుల కంటే ఐడియాలు చాలా ముఖ్యం. ఈ దేశంలో జీరో పావర్టీ మన అందరి లక్ష్యం కావాలన్నారు. మనకందరికి ఈ స్థాయిని సమాజం ఇచ్చింది. ఇప్పటి అనేక మౌళిక సదుపాయాలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీ 3) రూపంలో వచ్చాయి. కానీ దీంటో కొంత మంది కోట్ల మంది సంపాధించారు. ధనవంతులు అయ్యారు. ఇదే సమయంలో పేద వాళ్లు పేదవారిగానే మారుతున్నారు. జీరో పావర్టీ ఉంటాలంటే పబ్లిక్, ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్ షిప్ అవసరం అన్నారు. ఇక్కడున్న వారంతా మీకు నచ్చిన పది కుటుంబాలను మీతో సమానంగా కాకపోయినా మీ వెనక నడిపించినా అదే నిజమైన సమాజ సేవ అన్నారు. అధికంగా సంపాధిస్తున్న వారు పేదవారుగా ఉన్న పది శాతం మందిని దత్తత తీసుకోవాలన్నారు. పాపులేషన్ మేనేజ్ మెంట్ గురించి మాట్లాడుతున్నాను. ప్రస్తుతం దక్షిణ భారత దేశం జనాభా తగ్గిపోతున్నది. దక్షిణ కొరియా, జపాన్, చైనా, జర్మన్ వంటి అగ్రదేశాలు జనాభా తగ్గిపోయి ఇబ్బందులు పడుతోంది. జనాభా విషయంలో జాగ్రత్త పడగలిగితే ఈ ప్రపంచాన్ని పరిపాలించే శక్తి భారతదేశానికే ఉంటుందన్నారు. ఇది అతిశయోక్తి కాదన్నారు.
నాడు ఎగతాళి చేశారు:
ప్రపంచంలోనే మేటి నగరంగా హైదరాబాద్ మారిందంటే దూరదృష్టే కారణం అని ఆనాడు టీడీపీ (TDP) ప్రభుత్వం వేసిన పునాది వల్లే ఇక్కడ ఆదాయం పెరిగిందన్నారు. ప్రస్తుతం దేశవిదేశాల్లో తెలుగువాళ్లు గొప్పగా రాణిస్తున్నారని చెప్పారు. దేశానికి దశ, దిశ చూపిన వ్యక్తి పీవీ నరసింహారావు అన్నారు. ఆనాడు ఐటీ అంటే అనేక మంది ఎగతాళి చేశారు. కానీ ఇప్పుడు విదేశాల్లో అనేక మంది తెలుగు వారు పారిశ్రామికవేత్తలుగా మారారన్నారు. అమెరికాలో మన తెలుగువాళ్లే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారని చెప్పారు. ప్రపంచ నలుమూలల నుంచి తెలుగువారు ఇక్కడకు వచ్చారు. వివిధ దేశాల తెలుగు సమాఖ్యల అధ్యక్షులు ఇక్కడకు వచ్చారు. నా జీవితంలో ఇది చాలా సంతోషకరమైన రోజు అన్నారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైందని ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నామన్నారు.