ఎంజీబీఎస్-చంద్రయాన్ గుట్ట మెట్రో భూసేకరణలో కీలక ఘట్టం
పాతబస్తీ మెట్రో భూసేకరణలో కీలక ఘట్టం త్వరలో పూర్తి కానుంది. మెట్రో లైన్ కారణంగా ఆస్తులు కోల్పోతున్న యజమానులకు సోమవారం చెక్కుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధం అయింది.
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరానికి తలమానికంగా నిలుస్తున్న మెట్రో(Metro) మరికొన్ని మార్గాల్లో కూడా విస్తరించనుంది. ఈ మేరకు కొత్త మెట్రో లైన్(New metro line) లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఇప్పటికే భూసేకరణ(Land acquisition) అధికారులు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలోనే పాతబస్తీ మెట్రో(Oldcity Metro) భూసేకరణలో కీలక ఘట్టం త్వరలో పూర్తి కానుంది. మెట్రో లైన్(Metro line) కారణంగా ఆస్తులు కోల్పోతున్న యజమానులకు సోమవారం చెక్కుల పంపిణీ(Cheques Distribution)కి ప్రభుత్వం(Govt) సిద్ధం అయింది. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి.. నుండి చంద్రాయణగుట్ట మార్గం(Chandrayanagutta route)లో సర్వే చేసిన అధికారులు.. ఇప్పటి వరకు 1100 ప్రభావిత ఆస్తులు గుర్తించారు. వీరిలో మొత్తం 169 మంది ప్రజలు అనుమతి పత్రాలను మెట్రో లైన్ కోసం ప్రభుత్వానికి సమర్పించారు. వీరిలో 40 కి పైగా ఆస్తుల యాజమానుల ధృవీకరణ పూర్తి అయింది. దీంతో వారికి చదరపు గజానికి రూ.81 వేలు ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో సోమవారం ఆస్తులు కోల్పోతున్న యజమానులకు మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అసదుద్దీన్ కలిసి చెక్కులను పంపిణీ చేయనున్నారు.