లిథియం, గ్రాఫైట్ గనుల తవ్వకాల వైపు సింగరేణిని తీర్చిదిద్దుతున్నాం: డిప్యూటీ సీఎం భట్టి

Update: 2025-01-05 11:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాజీవ్ గాంధీ సివిల్స్ అభ‌య హ‌స్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి(Deputy Chief Minister) భ‌ట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. సింగరేణి (Singareni)ని మైనింగ్ రంగాల్లో దేశవ్యాప్తంగా విస్తరించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని.. ఏ రాష్ట్రంలో లేని విధంగా గనుల తవ్వకం లో వందేళ్ల అనుభవం సింగరేణికి ఉందని అన్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న లిథియం(Lithium), గ్రాఫైట్(Graphite) వంటి గనుల తవ్వకాల వైపు సింగరేణిని తీర్చిదిద్దుతున్నామని.. ఇందుకుగాను దేశవ్యాప్తంగా నిపుణులను ఆహ్వానించి వారి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు పోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) చెప్పుకొచ్చారు.


Similar News