BJP: బీజేపీ సంస్కృతికి కాంగ్రెస్ కుసంస్కృతికి తేడా ఇదే.. బీజేపీ తెలంగాణ ట్వీట్
బీజేపీ సంస్కృతి(BJP culture)కి కాంగ్రెస్ కుసంస్కృతి(Congress culture)కి తేడా ఇదేనని చెడుతూ బీజేపీ తెలంగాణ(BJP Telangana) సంచలన ట్వీట్ చేసింది.
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ సంస్కృతి(BJP culture)కి కాంగ్రెస్ కుసంస్కృతి(Congress culture)కి తేడా ఇదేనని చెడుతూ బీజేపీ తెలంగాణ(BJP Telangana) సంచలన ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ లో కార్యకర్తకు సైతం సమున్నత స్థానం, ప్రతిభ ఉంటే అత్యున్నత పదవినిచ్చే సంప్రదాయం, పార్టీ జెండా పట్టుకున్నోళ్లకు పదవిలో ఉన్నోళ్లకు సమాన గౌరవం ఇవ్వడం బీజేపీ సంస్కృతి అని తెలిపింది. అలాగే కార్యకర్తలనే కాలుతో తన్నే సంప్రదాయం, సమున్నత స్థానాల్లో పనిచేసిన పెద్దలకూ అవమానం, ప్రణబ్, పీవీ, మన్మోహన్ లను అగౌరవించిన సంస్కృతి కాంగ్రెస్ ది అని ఆరోపణలు చేసింది. దీనిపై సిద్ధాంతాలకు కట్టుబడి క్రమశిక్షణతో నడుస్తూ.. కార్యకర్త ప్రతిభను, విలువను గుర్తించే పార్టీకి.. కార్యకర్తకు కనీస మర్యాద ఇవ్వకుండా పార్టీలో ప్రధాన పదవుల్లో, ప్రజాస్వామ్యంలో అత్యున్నత స్థానాల్లో పనిచేసిన వారిని సైతం అగౌరవించే కాంగ్రెస్‌కు తేడా స్పష్టం అవుతుందని బీజేపీ తెలంగాణ రాసుకొచ్చింది.