Chamala: బుద్ది మార్చుకోకపోతే పోయేది పాతాలానికే..! కేటీఆర్‌కు ఎంపీ చామల కౌంటర్

కేటీఆర్ తెలుగు(Telugu) తెలిసిన వాడ్ని కాదు.. తెలంగాణ(Telangana) గురించి తెలిసిన వాడిని అడ్మిన్(Admin) గా పెట్టుకో.. ఇట్లాంటి అడ్డగోలు రాతలు రాయమంటే వాళ్లే నీకింత గడ్డి పెట్టేవాడని భువనగిరి(Bhuvanagiri) కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Congress MP Chamala Kiran Kumar Reddy) అన్నారు.

Update: 2025-01-05 13:05 GMT

దిశ, వెబ్ డెస్క్: కేటీఆర్ తెలుగు(Telugu) తెలిసిన వాడ్ని కాదు.. తెలంగాణ(Telangana) గురించి తెలిసిన వాడిని అడ్మిన్(Admin) గా పెట్టుకో.. ఇట్లాంటి అడ్డగోలు రాతలు రాయమంటే వాళ్లే నీకింత గడ్డి పెట్టేవాడని భువనగిరి(Bhuvanagiri) కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Congress MP Chamala Kiran Kumar Reddy) అన్నారు. కాంగ్రెస్(Congress) పై విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) చేసిన ట్వీట్ కు చామల కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన.. రైతుల విషయంలో మీకు, మాకు పోలికా..? అంటూ వరేస్తే ఉరే అన్న మీరెక్కడ?, రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక ధాన్యం రికార్డు సృష్టించిన మేమెక్కడ? అని వ్యాఖ్యానించారు.

రైతులకు రూ.లక్ష రుణమాఫీ అని చెప్పి ఐదేండ్లు వంచించిన మీరెక్కడ?, మాటిచ్చిన ఏడాదిలోపే రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేసిన మేమెక్కడ? అంటూ.. కేవలం పెట్టుబడి సాయం పేరుతో రాళ్లు, రప్పలకు రూ.22 వేల కోట్లు మింగిన మీరెక్కడ?, పండించే ప్రతి భూమికి రూ.12 వేల రైతు భరోసాతో పాటు, రూ.500 ల బోనస్, పంట బీమా, పంట నష్టపరిహారం, సబ్సిడీ విత్తనాలు కల్పిస్తున్న మేమెక్కడ? అని ప్రశ్నించారు. ఇక భూమి లేకపోతే రైతు కూలీ బజారున పడాల్సిందే అన్న మీరెక్కడ?, గుంట భూమి లేకపోయినా రూ.12 వేలిస్తున్న మేమెక్కడ? అని, ధరణి దోపిడీతో లక్షల ఎకరాల రైతుల భూముల్ని గుంజుకున్న మీరెక్కడ?, భూభారతి చట్టంతో రైతుల కష్టాలు తీరుస్తున్న మేమెక్కడ? అని నిలదీశారు. మీ పదేండ్ల అరాచకం.. మీ దోపిడీతనం అంతా ప్రజలకు తెలుసని, అందుకే అసెంబ్లీలో జాడిచ్చి తన్ని, పార్లమెంటులో పాతరేసిర్రు అంటూ.. ఇంకా మీ బుద్ధి మార్చుకోకపోతే ఇగ పోయేది పాతాళానికే! అని కాంగ్రెస్ ఎంపీ ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News