ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుంటే కడుపు కాలుతోందా.. బీఆర్ఎస్ నాయకులపై మంత్రి సీతక్క ఫైర్
ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తుంటే బీఆర్ఎస్ నాయకుల కడుపు కాలుతోందని మంత్ర సీతక్క ఫైర్ అయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్ : ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తుంటే బీఆర్ఎస్ నాయకుల కడుపు కాలుతోందని మంత్ర సీతక్క ఫైర్ అయ్యారు. బుధవారం సెక్రటేరియట్‌లోని మంత్రి కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కూడా గడవక ముందే తమపై బీఆర్ఎస్ నేతలు విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించడం వారు ఓర్చుకోలేకపోతున్నారని అన్నారు. గులాబీ నేతలు ప్రచారం చేస్తున్న అవాస్తవాలను సమర్ధవంతంగా కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు ప్రతి ఒక్క హామీని అమలు చేసి చూపిస్తామని హితవు పలికారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధించేలా ప్రతి ఒక్కరూ విధిగా ఓటేసి ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు.