‘‘బతకలేక పోతున్నాం.. బిల్లులు విడుదల చేయండి’’.. మంత్రి హరీష్ రావుకు వినతిపత్రం
వేర్వేరు ప్రభుత్వ విభాగాల్లో అద్దెపై నడుస్తున్న కార్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ ఫోర్‌వీలర్
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: వేర్వేరు ప్రభుత్వ విభాగాల్లో అద్దెపై నడుస్తున్న కార్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ ఫోర్వీలర్డ్రైవర్స్అసోసియేషన్వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్సలావుద్దీన్మంత్రి హరీష్‌రావుకు వినతిపత్రం సమర్పించారు. అదే సమయంలో కార్ల అద్దెను కూడా పెంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన వేర్వేరు శాఖల్లో ప్రస్తుతం 13వేలకు పైగా కార్లు అద్దెకు నడుస్తున్నట్టు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 33, పట్టణ ప్రాంతాల్లో 34వేల రూపాయలను ఇస్తున్నట్టు తెలిపారు. అయితే, భూగర్భ జల శాఖలో నడుస్తున్న కార్లకు సంబంధించి 12 నెలలుగా బిల్లులు విడుదల కాలేదని పేర్కొన్నారు.
అదేవిధంగా పంచాయత్రాజ్ఇంజనీరింగ్శాఖలో 25, ఎక్సయిజ్శాఖలో 15, రోడ్లు, భవనాల శాఖలో 15, సాంఘిక సంక్షేమ శాఖలో 10, బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ సంక్షేమ శాఖల్లో 12, వాణిజ్య పన్నుల శాఖలో 6, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో 9, జిల్లా రూరల్డెవలప్మెంట్ఏజన్సీలో 6 నెలలుగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపారు. నెలల తరబడిగా బిల్లులు మంజూరు కాకపోతుండటంతో డ్రైవర్లు, వారి కుటుంబాలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయని వివరించారు. చాలామంది వేర్వేరు బ్యాంకులు, ఫైనాన్స్సంస్థల నుంచి రుణాలు తీసుకుని కార్లను కొని ప్రభుత్వ శాఖల్లో నడుపుతున్నట్టు చెప్పారు. బిల్లులు రాకపోవటంతో ఈఎంఐలు కూడా కట్టుకోలేకపోతున్నట్టు పేర్కొన్నారు.
ఇక, కార్ల అద్దెలను ఏడేళ్ల క్రితం నిర్ణయించారని షేక్సలావుద్దీన్తన వినతిపత్రంలో తెలిపారు. అప్పటికి ఇప్పటికి పెట్రోల్, డీజీల్ధరలు దాదాపుగా రెండింతలైనట్టు పేర్కొన్నారు. అదేవిధంగా అన్ని నిత్యావసర సరుకుల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏడేళ్ల క్రితం నిర్ణయించిన అద్దెలే ఇప్పటికీ చెల్లిస్తుండటంతో డ్రైవర్లు కుటుంబాలను పోషించుకోలేకపోతున్నారని వివరించారు. ఆయా ప్రభుత్వ శాఖల్లో కార్లు నడుపుతున్న వారిపై ఆధారపడి వారి కుటుంబసభ్యులు దాదాపు అరవై వేల మంది ఉన్నట్టుగా పేర్కొన్నారు. ఈ సమస్యలను పరిగణలోకి తీసుకుని హైదరాబాద్‌లో 68 వేలు, జిల్లాల్లో 66 వేల రూపాయలకు అద్దెను పెంచాలని విజ్ఞప్తి చేశారు.