Minister Ponnam: హైదరాబాద్ మరో ఢిల్లీ కావొద్దనే ఆ పని చేశాం.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ (Hyderabad).. కాలుష్యానికి నెలవుగా మారిన మరో ఢిల్లీ (Delhi) కావొద్దనే తమ ప్రభుత్వం రాష్ట్రంలో యుద్ధ ప్రాతిపదికన ఈవీ పాలసీ (EV Policy)ని ప్రవేశ పెట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు.

Update: 2024-11-28 04:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad).. కాలుష్యానికి నెలవుగా మారిన మరో ఢిల్లీ (Delhi) కావొద్దనే తమ ప్రభుత్వం రాష్ట్రంలో యుద్ధ ప్రాతిపదికన ఈవీ పాలసీ (EV Policy)ని ప్రవేశ పెట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ (Hyderabad) మహా నగరంలో కాలుష్యం క్రమంగా పెరుగుతోందని తెలిపారు. అందుకే ప్రభుత్వం కొత్త ఈవీ పాలసీ (EV Policy)ని తీసుకొచ్చిందని అన్నారు. బ్యాటరీ వాహనాలు (Battery Vehicles) కొనుగోలు చేసే వారికి ప్రత్యేక రాయితీలు కూడా ప్రకటించామని పేర్కొన్నారు.

ఆ రాయితీలు మరో రెండేళ్ల పాటు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. గత ప్రభుత్వంలో పరిమితమైన వాహనాలకు మాత్రమే రాయితీలు ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలోకి వచ్చాక రాయితీలను అన్‌లిమిటెడ్ చేశామని అన్నారు. కొత్త ఈవీ పాలసీ (EV Policy)తో వాహనాల కొనుగోళ్లు కూడా విపరీతంగా పెరిగాయని తెలిపారు. హైదరాబాద్ (Hyderabad) మహా నగరాన్ని కాలుష్యం నుంచి రక్షించుకునే బాధ్యత వాహనదారులపై కూడా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Tags:    

Similar News