Shamshabad Airport: ఎయిర్‌పోర్టులో ప్రయాణికుడి హల్‌చల్.. తన వద్ద బాంబు ఉందంటూ..

ఓ ప్రయాణికుడు హల్‌చల్ సృష్టించిన ఘటన శంషాబాద్ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టు (Shamshabad International Airport)లో చోటుచేసుకుంది.

Update: 2024-11-16 03:26 GMT
Shamshabad Airport: ఎయిర్‌పోర్టులో ప్రయాణికుడి హల్‌చల్.. తన వద్ద బాంబు ఉందంటూ..
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్/శంషాబాద్: బ్యాంకాక్ వెళ్తున్న విమానంలో ఓ వ్యక్తి బాంబు ఉందని బెదిరించడంతో ఒక్కసారిగా శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport) ఉలిక్కిపడింది. వివరాల్లోకి వెళితే.. శనివారం హైదరాబాద్ (Hyderabad) నుంచి బ్యాంకాక్ (Bagnkok) వెళ్తున్న ఓ విమానంలో టేకప్ సమయానికి తన వద్ద బాంబు ఉందని ఓ ప్రయాణికులు తీవ్ర కలకలం సృష్టించాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఎయిర్‌లైన్స్ అధికారులు, ప్రయాణికులు భయాందోళన గురయ్యారు. వెంటనే సీఐఎస్ఎఫ్ (CISF) పోలీసులకు, ఎయిర్‌పోర్టు అధికారులకు పైలెట్ సమాచారం ఇవ్వడంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. విమానంలో ప్రతి ప్రయాణికుడిని డాగ్, బాంబు స్క్వాడ్‌ బృందాలు క్షుణ్ణంగా చెశారు. అనంతరం సీఐఎస్ఎఫ్ పోలీసులు, ఎయిర్‌పోర్టు అధికారులు ప్రయాణికుడిని విచారిస్తున్నారు. విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యంకాకపోవడంతో ప్రయాణికులు, ఎయిర్‌‌లైన్స్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News