పలు రైళ్లు పాక్షిక రద్దు
దిశ, తెలంగాణ బ్యూరో: పట్టాల మరమ్మతుల కారణంగా పలు రైళ్లు పాక్షిక రద్దు చేసినట్లు దక్షి
దిశ, తెలంగాణ బ్యూరో: పట్టాల మరమ్మతుల కారణంగా పలు రైళ్లు పాక్షిక రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు శనివారం దౌల్తాబాద్ యార్డ్, నాందేడ్ డివిజన్‌లో పట్టాల మరమ్మతు పనులు జరుగుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్- ఔరంగాబాద్, నిజామబాద్-పూణే, కాచిగూడ-రొటేగావ్, నర్సాపూర్-నాగర్‌సోల్, మన్మాడ్-హెచ్ ఎస్ నాందేడ్, ధర్మాబాద్-మన్మాడ్, గల రాకపోకలు సాగించే 9 రైళ్ళను పాక్షికంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. నాందేడ్- అమృత్‌సర్, నాందేడ్- ముంబాయ్ సీఎస్ఎంటీ, నాగర్ సోల్- నర్సాపూర్ గల రాకపోకలు సాగించే రైళ్ళను రీ షెడ్యూల్ చేసినట్లు పేర్కొన్నారు. జల్నా-ముంబాయి రైలు ను రద్దు చేసినట్లు, 2 రైళ్ల సర్వీస్‌లను (రెగ్యులేషన్) నియంత్రించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.