కరాటేలో సత్తా చాటిన ఏడేళ్ల బాలిక.. తన్వితకు అవార్డు అందజేసిన స్టార్ హీరో

పిట్ట కొంచెం కూత ఘనం అన్న సామెత చిన్నారి తన్వితను చూస్తే ఇట్టే గుర్తుకొస్తుంది.

Update: 2025-03-18 15:43 GMT
కరాటేలో సత్తా చాటిన ఏడేళ్ల బాలిక.. తన్వితకు అవార్డు అందజేసిన స్టార్ హీరో
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: పిట్ట కొంచెం కూత ఘనం అన్న సామెత చిన్నారి తన్వితను చూస్తే ఇట్టే గుర్తుకొస్తుంది. అంత చిన్న వయస్సులో ఈ చిన్నారి సాధించిన ఘనతకు ఎవరైనా అబ్బురపోవాల్సిందే. ఎల్బీనగర్‌ (LB Nagar), మన్సురాబాద్ (Mansoora Bad) లోని ఓ స్కూల్ లో రెండో తరగతి చదువుతున్న దాచేపల్లి తన్విత.. కరాటే పోటీల్లో పాల్గొని, ఏకంగా బ్లాక్‌ బెల్ట్‌ (Black Belt) సాధించి, అందర్ని ఆశ్చర్య పరిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన హీరో సుమన్‌ (Hero Suman) చిన్నారి తన్వితకు అవార్డును అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన.. ఏడేళ్లకే బ్లాక్ బెల్ట్ సాధించడం ఆషా మాషీ కాదని, దీని వెనుక తల్లిదండ్రుల (Parents) కృషి ఎంతో ఉంటేనే, చిన్నారి ఈ ఘనత సాధించిందని కొనియాడారు. తమ ముద్దుల కూతురు ఏడేళ్లకే అవార్డు సాధించడంతో అమ్మనాన్నలు.. ప్రియత, కార్తీక్‌లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరి స్వస్థలం సూర్యాపేట జిల్లా (Suryapeta District) తుంగతుర్తి మండలం (Thungaturthi Mandal) కొత్తగూడెం గ్రామం (Kothagudem Village) కాగా.. కొన్నేండ్ల నుంచి ఎల్బీనగర్‌లో నివాసం ఉంటున్నారు.


Similar News