జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ సన్నాహక సమావేశం : పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​ గౌడ్

జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకవెళ్లేందుకు ప్రతి గ్రామంలో పాదయాద్ర చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్ ​గౌడ్ పిలుపునిచ్చారు.

Update: 2025-03-19 16:59 GMT
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ సన్నాహక సమావేశం : పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​ గౌడ్
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో : జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకవెళ్లేందుకు ప్రతి గ్రామంలో పాదయాద్ర చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్ ​గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం గాంధీ భవన్​లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య​అతిథులుగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హాజరుకాగా అతిథులుగా మంత్రి పొన్నం ప్రభాకర్​, సీడబ్ల్యూసీ సభ్యులు వంశీచంద్ రెడ్డి, కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు, కో ఆర్డినెటర్లు పాల్గొన్నారు. ఈసందర్భంగా మహేశ్​ కుమార్​ గౌడ్​ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదానికి పిలుపునిచ్చారని పేర్కొన్నారు. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు దేశ సమాజం క్షమించారనిదన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని క్షేత్ర స్థాయిలో బలంగా తీసుకెళ్ళాల్సిన అసవరం ఉందన్నారు.

జైబాపు, జై భీమ్, జై సంవిధాన్ ఆశయాలకు తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ విధానాలను రూపొందిస్తుందన్నారు. రాష్ట్రంలో విప్లవాత్మక కార్యక్రమాలు తీసుకోవడం జరిగిందన్నారు. బీసి కుల గణన, ఎస్సీ వర్గీకరణ బిల్లుల ఆమోదం సామాజిక విప్లవం తీసుకువస్తుందన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో కలిసి కట్టుగా విచ్చేసి కార్యాచరణలో భాగస్వామ్యం కావాలని వారు పిలుపునిచ్చారు. సంవిదాన్​ కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లాలో వెంటనే డీసీసీ సమావేశాలునిర్వహించి, సంవివాదన్​ కార్యచరణను రూపొందించుకోవాలన్నారు. నియమించిన కోఆర్డినేటర్లు ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి పాదయాత్రలుచేయాలన్నారు. ప్రతి గ్రామంలో పాదయాత్రలు చేసే విధంగా ప్రణాళిక ఉండాలన్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు అంబేద్కర్​ విగ్రహానికి నివాళ్లర్పించి ప్రారంభించాలని సూచించారు. ఏప్రిల్​ 27 వరకు ఈకార్యక్రమాన్నికొనసాగించాలన్నారు. సంవిదాన్​ కార్యక్రమం సంవత్సరం పాటు ఉంటుందని, మొదట నెల రోజుల కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.

డీసీసీల మాట ఏవ్వరు వింట లేరు...

ఈ సమావేశంలోపాల్గొన్నపలువురు నాయకులు తమ ఆవేదనను పీసీసీ అధ్యక్షుడికి విన్నవించారు. అధికారంలోకి వచ్చాక డీసీసీ అధ్యక్షుల మాటలను ఏవ్వరు వినడంలేదని, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఏవ్వరు కూడా వినడంలేదని, తమకు తెలియకుండానే మండల అద్యక్షులను నియమించుకున్నారని, వారు తాము చెబితే ఎందుకు వింటారని ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాకు చెందిన ఒక కొత్త జిల్లా కీలకపదవిలో ఉన్న నాయకులు తెలిపారు. అధికారంలోకి వచ్చాక ఏవ్వరికి వినడంలేదని సభ దృష్టికి తీసుకవచ్చారు. ఇప్పుడు పార్టీకార్యక్రమాలు, సమావేశాల గురించి పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక డీసీసీ అధ్యక్షులకు పనిలేకుండా పోయిందని, అంతా ఎమ్మెల్యేలే , ఇతర నాయకులే చూసుకుంటున్నారని సభ దృష్టికి తీసుకవచ్చారు. డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, మంత్రులకు కోఆర్డినేషన్​ ఉండటం లేదని సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించారు. నిజామాబాద్​ జిల్లాకు చెందిన ముఖ్య నాయకుడు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా సమాచారం.

Tags:    

Similar News