TG Assembly: భూముల గురించి హరీశ్ మాట్లాడటం జోక్.. మంత్రి కోమటి‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

ఏడో రోజు అసెంబ్లీ (Assembly) సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి.

Update: 2025-03-21 06:15 GMT
TG Assembly: భూముల గురించి హరీశ్ మాట్లాడటం జోక్.. మంత్రి కోమటి‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఏడో రోజు అసెంబ్లీ (Assembly) సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. సభలో ఇవాళ బడ్జెట్‌లో వివిధ శాఖలకు నిధుల కేటాయింపుల చర్చ కొనసాగుతోంది. విపక్ష సభ్యుడు హరీశ్ రావు (Harish Rao) మాట్లాడుతూ.. తెలంగాణ (Telangana) వృద్ధి రేటు దేశంలో పోలిస్తే పూర్తిగా తగ్గిపోయిందని కామెంట్ చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పడిన తరువాత ఎప్పుడు ఇలా జరగలేదని అన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్టేషన్ల ఆదాయం భారీగా తగ్గిపోయిందని అన్నారు. 2023-24 నాటికి ఆదాయం రూ.14 వేల కోట్లు పెరిగిందని అన్నారు. కానీ, 2024-25లో ఆదాయం కేవలం రూ.12 వేల కోట్లేనని.. గ్రోత్ రేట్ కూడా మైనస్‌లోకి వెళ్లిపోయిందని సభ దృష్టి తీసుకొచ్చారు. ఆర్థిక మాద్యం కాదు.. ప్రభుత్వ బుద్ధి మాంద్యం వల్లే పరిస్థతి ఇలా ఉందని అన్నారు. అందుకే గచ్చిబౌలిలో 400 ఎకరాలు వేలం వేయాలని చూస్తున్నారని.. దాంతో రూ.30 వేల కోట్లు రాబట్టాలని అనుకుంటున్నారని సర్కార్‌పై ఆరోపణలు గుప్పించారు.

ఈ క్రమంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy, హరీశ్ రావు (Harish Rao)కు కౌంటర్ ఇచ్చారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ (Hyderabad) అభివృద్ధి శూన్యమని.. అంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని అన్నారు. కమిషన్లకు కక్కుర్తి పడి ఔటర్ రింగ్ రోడ్డు టెండర్‌ను రూ.7,300 కోట్లకు ప్రైవేటు సంస్థ చేతిలో పెట్టారని ధ్వజమెత్తారు. గతంలో మద్యం దుకాణాల గుడువుకు 3 నెలల ముందే దరఖాస్తులు తీసుకున్నారని దుయ్యబట్టారు. నిరుద్యోగుల వద్ద నాన్ రిఫండబుల్ ఫండ్ కింద రూ.2 వేల కోట్లు వేసూలు చేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. భూములు గురించి హరీశ్ రావు మాట్లాడటం హస్యాస్పదంగా ఉందని అన్నారు. కోకాపేట భూములు వేలం వేసిన చరిత్ర ఎవరిదని మండిపడ్డారు. హరీశ్‌రావును ముందు పెట్టి మాట్లాడిస్తున్నారని.. ఆయన వెనుక మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారంటూ మంత్రి కోమటి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.   

Tags:    

Similar News