Betting apps: బెట్టింగ్ యాప్స్ కేసులో ముందడుగు.. ఆత్మహత్యల వివరాల వెలికితీత!

రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ భూతంను పూర్తిగా తరిమికొట్టే పనిలో తెలంగాణ పోలీసులు పడ్డారు.

Update: 2025-03-21 07:13 GMT
Betting apps: బెట్టింగ్ యాప్స్ కేసులో ముందడుగు.. ఆత్మహత్యల వివరాల వెలికితీత!
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ భూతంను పూర్తిగా తరిమికొట్టే పనిలో తెలంగాణ పోలీసులు పడ్డారు. ఈ నేపథ్యంలోనే (betting apps case) బెట్టింగ్ యాప్స్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకు బెట్టింగ్‌లో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న వారి వివరాలు పోలీసులు సేకరిస్తున్నట్లు సమాచారం. గత ఏడాది కాలంలో బెట్టింగ్‌ల వల్ల 15 మంది ఆత్మహత్య చేసుకున్నారని తెలిసింది. ఈ మేరకు తెలంగాణ వ్యాప్తంగా 15 కేసులు నమోదు అయినట్లు సమాచారం. ఈ కేసులను ఇప్పుడు పోలీసులు వెలికి తీస్తున్నట్లు తెలిసింది. వారు ఆత్మహత్య చేసుకోవడానికి దోహదపడ్డ బెట్టింగ్ యాప్స్‌ను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ క్రమంలోనే ఆ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, వాటి ప్రమోటర్లను పోలీసులు నిందితులుగా చేర్చనున్నట్లు సమాచారం.

కాగా, బెట్టింగ్ యాప్స్ విషయంలో టాలివుడ్ నటులు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు సహా మొత్తం 25 మందిపై మియాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నటులు రానా దగ్గుబాటి, విజయ్‌ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్‌, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్‌, అనన్య నాగళ్ల ఉన్నారు. ఇక, సోషల్ మీడియా స్టార్లు సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి, వాసంతి కృష్ణన్‌, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్‌, పండు, పద్మావతి, ఇమ్రాన్‌ఖాన్‌, విష్ణు ప్రియ, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్‌, యాంకర్‌ శ్యామల, టేస్టీ తేజ, రీతూ చౌదరి, బండారు సుప్రీత ఉన్నారు. మియాపూర్‌ వాసి ప్రమోద్‌ శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

బెట్టింగ్ యాప్స్ కేసులు.. మరో కీలక నిర్ణయం తీసుకున్న పోలీసులు

వామ్మో ఇన్ని లక్షలా..? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌తో విష్ణుప్రియ ఇంత సంపాదించిందా?

Tags:    

Similar News