మిషన్ భగీరథ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి.. తాగునీటిపై తప్పుడు ప్రచారం: సీతక్క

రాష్ట్రంలో తాగునీటి సమస్యలు లేకున్నా కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు.

Update: 2025-03-21 06:32 GMT
మిషన్ భగీరథ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి.. తాగునీటిపై తప్పుడు ప్రచారం: సీతక్క
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో తాగునీటి సమస్యలు లేకున్నా కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క (Minister Seethakka) మండిపడ్డారు. ఈ తప్పుడు ప్రచారాన్ని స్థానిక అధికారులు తిప్పి కొట్టాలని ఆదేశించారు. రాజకీయ ప్రయోజనాల ఒక పత్రికలో తప్పుడు రాతలు రాస్తున్నారని, ఆ కథనాల్లో నిజమెంతో ఎప్పటికప్పుడు నివేదించాలని వెల్లడించారు. తాగునీటి సరఫరా సరిగా చేయకున్నా, తప్పుడు వార్తలను ఖండించకపోయినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇవాళ ఎర్రమంజిల్ (Mission Bhagiratha) మిషన్ భగీరథ కార్యాలయంలో మిషన్ భగీరథ అధికారులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

మిషన్ భగీరథ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రిజర్వాయర్లలో తాగునీటికి తగినంత నీటి నిల్వలు ఉన్నాయని, గతంలో తాగునీరు అందని గ్రామాలకు కూడా ఈ సారి తాగునీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఏదైనా సాంకేతిక కారణాలతో సమస్యలు తలెత్తిన ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. తాగునీటి అవసరాలకు ఇచ్చేందుకు ప్రతి కలెక్టర్ వద్ద రెండు కోట్ల రూపాయల నిధులను అందుబాటులో ఉంచుతున్నామని వెల్లడించారు. జాగ్రత్తగా తాగు నీటిని వినియోగించాలని, తాగునీటి సరఫరా లో సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని, సమస్య తలెత్తిన వెంటనే పరిష్కారం చూపాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.

Tags:    

Similar News