TG Assembly: వాహనదారులకు గుడ్ న్యూస్.. అసెంబ్లీలో కోమటిరెడ్డి కీలక ప్రకటన

అసెంబ్లీ (Assembly) సమావేశాల్లో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komati Reddy Venkat Reddy) వాహనదారుకు గుడ్ న్యూస్ చెప్పారు.

Update: 2025-03-21 06:57 GMT
TG Assembly: వాహనదారులకు గుడ్ న్యూస్.. అసెంబ్లీలో కోమటిరెడ్డి కీలక ప్రకటన
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ (Assembly) సమావేశాల్లో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komati Reddy Venkat Reddy) వాహనదారుకు గుడ్ న్యూస్ చెప్పారు. బడ్జెట్‌ (Budget)పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ రోడ్లు (Village Roads), రాష్ట్ర రహదారులకు (Sate Roads) టోల్‌ (Toll) విధించే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. రోడ్డు పనులకు టెండర్లు (Tenders) వేసి పనులు చేపట్టిన కాంట్రాక్టర్ల (Contractors)కు ఇవ్వాల్సిన 40 శాతం పేమెంట్ కూడా ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు.

ప్రతి నియోజకవర్గంలో మండలాలను అనుసంధానం చేస్తూ ప్రతి గ్రామాలకు మధ్య ఉన్న లింక్ రోడ్లను డబుల్‌ రోడ్లు (Double Roads) చేయబోతున్నామని ప్రకటించారు. గత ప్రభుత్వ పాలకులు రాష్ట్రంలోని రోడ్లును పట్టించుకున్న పాపాన పోలేదని సిరిసిల్ల (Sirisilla), సిద్దిపేట (Siddipet), గజ్వేల్‌ (Gajwel) నియోజకవర్గాల్లోనే రోడ్లు పడ్డాయని కామెంట్ చేశారు. ఆ మూడు ప్రాంతాల్లో కాకుండా.. బీఆర్ఎస్ సర్కార్ (BRS Government) హయాంలో ఎక్కడైనా రోడ్లు వేసినట్లుగా చూపిస్తే తాను దేనికైనా సిద్ధమని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు.  

Tags:    

Similar News