రేపు పంచాయతీ రాజ్ శాఖలో కారుణ్య నియామ‌కాలు

పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ‌, పుర‌పాల‌క శాఖ‌లో కారుణ్య నియామక ఉద్యోగ నియామ‌క ప‌త్రాల అంద‌జేత‌ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గురువారం అందజేయనున్నారు.

Update: 2025-03-19 16:55 GMT
రేపు పంచాయతీ రాజ్ శాఖలో కారుణ్య నియామ‌కాలు
  • whatsapp icon

దిశ, తెలంగాణ : పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ‌, పుర‌పాల‌క శాఖ‌లో కారుణ్య నియామక ఉద్యోగ నియామ‌క ప‌త్రాల అంద‌జేత‌ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గురువారం అందజేయనున్నారు. రవీంద్రభారతీలో పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం 4గంటలకు నియామక పత్రాల అందజేత కార్యక్రమం నిర్వహించనున్నారు. 582 మంది కారుణ్య నియామ‌కాల‌తో పాటు, మిషన్ భగీరథ శాఖలో 55 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు, 27 మంది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖలో 38 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు 55 మంది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీత‌క్క చేతుల మీదుగా నియామక పత్రాలను అందుకోనున్నారు. కారుణ నియామాకాలను అమోదించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీ రాజ్ శాఖలో జిల్లా ప్రజా పరిషత్తులు, మండల ప్రజా పరిషత్తులు, పంచాయతీ రాజ్ శాఖలోని పాఠశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సర్వీసులో ఉండగా అకాల మరణం చెందిన వారి వారసులకు కారుణ్య నియమాకం క్రింద ఉద్యోగ అవకాశాలు కల్పించారు. పోస్టులు మంజూరు చేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించిన సీత‌క్కకు రుణపడి ఉంటామని నియామక పత్రాలు అందుకుంటున్న వారి కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు.

Tags:    

Similar News