గేటెడ్ కమ్యూనిటీ ఇళ్ల వైపు చూపు.. అసలు కారణాలు ఇవే..!
గేటెడ్ కమ్యూనిటీ ఇల్లును సొంతం చేసుకోవడానికే చాలామంది ఆసక్తి చూపుతున్నారు..

దిశ, రంగారెడ్డి బ్యూరో: పచ్చని చెట్లు, విశాలమైన పార్కులు, పిల్లలు ఆడుకునేందుకు చిన్న క్రీడా స్థలం, ఆహ్లాదకరమైన వాతావరణం. కాసేపు కబుర్లు చెప్పుకోవడానికి, కష్టాలు పంచుకోవడానికి అందుబాటులో క్లబ్బులు, పిల్లలు ఈత కొట్టేందుకు స్విమ్మింగ్ పూల్.. తమ నివాసాల పరిధిలో ఇలాంటి సౌకర్యాలు ఉండాలనే ఆలోచన ప్రతీ ఒక్కరికి ఉంటుంది. ప్రజల్లో ఉన్న ఈ ఆలోచనకు అనుగుణంగానే నిర్మాణాలు చేపడుతున్నారు రియల్ ఎస్టేట్వ్యాపారులు. ప్రధానంగా గేటెడ్ కమ్యూనిటీ ఇండ్లను అందుబాటులోకి తెస్తున్నారు. ఖాళీ సమయం దొరికితే అత్యధిక సమయం ఇంట్లో గడిపేలా ప్రశాంత వాతావరణం ఉండాలని ప్రజలు భావిస్తారు. అలాంటి ఇల్లును సొంతం చేసుకోవడానికే ఇప్పుడు చాలామంది ఆసక్తి చూపుతున్నారు.
ఇదీ.. ప్రత్యేకత
రియల్ వ్యాపారి నిర్ధేశించుకున్న స్థలంలో పదుల సంఖ్యలో ఇండ్లు నిర్మాణం చేయడం. చుట్టూ ఎత్తైన ప్రహరీని నిర్మించి ఎలక్ట్రికల్ఫెన్సింగ్ ఏర్పాటు చేడయం వంటివి చేస్తారు. పైగా అందులో ఉండే ఇండ్లకు వెళ్లేందుకు రెండు లేదా మూడు రహదారులు ఏర్పాటు చేయడం విశేషం. ఈ రహదారుల వద్ద ఉండే అవుట్గేట్, ఇన్ గేట్లో సెక్యూరిటీ గార్డ్ఉంటారు. ఇలా ఆ గేటెడ్ కమ్యూనిటీ మొత్తం భద్రతా వలయంలో నిమగ్నమై ఉంటుంది. ఇలాంటి సదుపాయాల నేపథ్యంలోనే ఇక్కడ ఇండ్లు కొనుగోలుపై ప్రజలకు మక్కువ చూపిస్తున్నారు.

సీసీ కెమెరాలతో నిఘా..
గేటెడ్ కమ్యూనిటీల్లోని ప్రతీ ఇల్లు భద్రతకు కేరాఫ్ అడ్రస్ అనే చెప్పాలి. లోపలికి వెళ్లే వారెవరు.. ఎవరింటికి వెళ్లారు? ఎన్ని గంటలకు వెళ్లారు? వారి ఫోన్ నంబర్, అడ్రస్ వంటి వివరాలన్నీ సేకరించి నమోదు చేసుకుంటారు అక్కడుండే సెక్యూరిటీ సిబ్బంది. తిరిగి ఆ వ్యక్తి ఎన్ని గంటలకు బయటికి వెళ్లింది కూడా రికార్డు బుక్‌లో సంతకం చెయించుకుంటారు. అంతేకాకుండా సీసీ కెమెరాల ఏర్పాటు, పటిష్టమైన ఫెన్సింగ్‌తో కూడిన ప్రహరీ ఉంటుంది. దీంతో బయటి వ్యక్తులు అంత ఈజీగా లోపలికి రాలేరు. అసాంఘిక కార్యకలాపాలకు అవకాశమే ఉండదు. కమ్యూనిటీ లోపల నడిపించే వహనాలు వేగం తక్కువగా ఉంటుంది. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం కూడా లేదు. భద్రత బందోబస్తుగా ఉంటుంది.
వృద్దులకు ఉపయోగం..
వయస్సు మీద పడుతున్నవ్యక్తులు ప్రశాంత వాతావరణంలో జీవించాలనుకుంటారు. అందుకోసం గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కొనుగోలు చేయాలని ఆరాట పడుతున్నారు చాలామంది. 55 యేండ్ల వయస్సుపైగా ఉన్నవాళ్లు ఆఫీసుల్లో కష్టపడి వస్తారు. ఆహ్లదంగా కాసేపు గడిపేందుకు అనుకూలమైన పరిస్థితి ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుందని భావిస్తున్నారు. పిల్లలు కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్కూల్లో నాలుగు గోడల మధ్య ఉండి ఒత్తిడికి లోనవుతుంటారు. గేటెడ్ కమ్యూనిటీలోనిని చిల్డ్రన్ పార్కులు ఇలాంటి ఒత్తిడిని దూరం చేస్తాయి. పిల్లలను ఈ పార్కులో వదిలేసి పెద్దలందరూ కలిసి క్లబ్‌లో, జిమ్‌లో కాలం గడుపుతారు. ఏ వయస్సు వారికి ఆస్ధాయిలో సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఇక వృద్దులకైతే తమ పిల్లలకు భారంగా ఉన్నామనే భావనను దూరం చేసే పరిస్థితి ఇక్కడి వాతావరణంలో కనిపిస్తుందని కోనుగోలు దారులు చెబుతున్నారు.
ఆరా తీయాల్సిన విషయాలివే..
ఇండిపెండింట్ ఇండ్ల కంటే గేటెడ్ కమ్యూనిటీల్లో కొనుగోలు చేసే ఇంటి ఖర్చు అధికంగా ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీల్లోని ఇండ్లు అన్నీ ఓకే విధంగా ఉంటాయి. ధరలు కూడా దాదాపు అదే స్ధాయిలో ఉండేందుకు అవకాశం ఉంది. మెయింటెనెన్స్ చార్జీలు ఎంత వసూల్ చేస్తారు.. నీటి బిల్లు, గ్యాస్ బిల్లుల ఎలా ఉన్నాయి. సరఫరా చేసే వ్యక్తులు అధికంగా ఏమైనా వసూళ్లు చేస్తారా..? స్విమ్మింగ్‌పూల్, జిమ్, పిల్లలు పార్కులు వాడుకునేందుకు నిబంధనలేమిటి? ఏమైనా నిర్వహణ చార్జీలు ఉంటాయా? స్పోర్ట్స్, మార్కెట్ లాంటివి ఉన్నట్లయితే బయటి ధరలకు సమానంగా ఇస్తున్నారా లేదా..? కమ్యూనిటీలో ఉండే రహదారులను పక్కనుండే కాలనీల వాళ్లు వాడుకునే అవకాశం ఉంటుందా..? వంటి అంశాలపై ఇతరులతో ఆరా తీయాలి.
కచ్చితంగా పాటించాల్సిందే...
- గేటెడ్ కమ్యూనిటీలు నగరానికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. రాకపోకలకు సమయం పడుతుంది.
- ఇంటికి వచ్చేవారు ఎవరైనా సరే విధిగా సెక్యూరిటీ వద్ద సంతకం చేయడం, యాజమాని నుంచి ఫోన్వస్తేనే పంపించడం తప్పనిసరి
- క్రమశిక్షణతో కూడిన ప్రవర్తన గేటెడ్ కమ్యూనిటీల్లో ఉండే ప్రజలల్లో కనిపిస్తుంది. కోన్ని రోజులు ఇబ్బందులు పడ్డా.. ఆ తర్వాత ఆలవాటు పడే అవకాశం ఉంటుంది.
- ఇంటి యాజమానికి అవసరమైన నిత్యావసరాలకు కోసం ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి.
- ఈ కమ్యూనిటీలో ఉండే సొంత యాజమాన్యులతో కలిపి సొసైటీ ఏర్పాటు చేసుకుంటారు. ఆ సొసైటీ ద్వారా ఏర్పాటైన కమిటీతో సమస్యలను పరిష్కరించుకుంటారు.