వెల్జాల్‌లో ఊర పందుల బెడద..
ఊర పందుల బెడదతో వెల్జాల్ రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.

దిశ, తలకొండపల్లి : ఊర పందుల బెడదతో వెల్జాల్ రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పంటపొలాల్లో వేసిన వేరుశనగ, మక్కచేన్లు, వరిపంట, టమాటా, ఇతర పంటలను, ముఖ్యంగా ఆవులకు పెంచుతున్న గడ్డిని సైతం నాశనం చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని గ్రామస్తులు ఆవేదనకు గురవుతున్నారు. షెడ్లు వేసి పెంచాల్సిన పందులు ఊర్లలో విచ్చలవిడిగా తిరుగుతూ రైతుల పంట పొలాలను నాశనం చేస్తున్నాయని వాపోయారు.
పందులు పెంచుతున్న నిర్వాహకులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని బాధితులు చెప్పుకొని వాపోతున్నారు. అడవిలో ఉండే పందుల బెడద ఒక వైపు, దానికి తోడు గ్రామంలో ఉండే ఊరపందుల బెడద మరో వైపు అని, తాము ఎలా బతకాలి పంటలను ఎలా కాపాడుకోవాలని లోలోన మదనపడుతూ కుంగిపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్య పరిష్కారం చేయాలని రైతులు వేడుకుంటున్నారు. అధికారులు స్పందించి ఈ సమస్య పరిష్కారం చేయాలని కోరుతున్నారు.