ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధన : కలెక్టర్
ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆంగ్ల బోధన గావించి, పిల్లలు ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడటం హర్షించదగిన విషయమని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.

దిశ, ప్రతినిధి వికారాబాద్ : ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆంగ్ల బోధన గావించి, పిల్లలు ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడటం హర్షించదగిన విషయమని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశం హాల్ నందు జరిగిన యంగ్ ఓరేటర్స్ క్లబ్ అలాగే బొస్చ్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యా కదంబం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఈ విద్యా సంవత్సరంలో ఏర్పాటు చేసిన వైఓసి యంగ్ ఓటర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నటువంటి ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ బోధించడం జరిగిందని, ఇంగ్లీష్ కు సంబంధించి విద్యార్థులు ధారాళంగా ఇంగ్లీషు మాట్లాడడానికి ఉపాధ్యాయులు వివిధ రకాల నృత్యాలు, యాక్టివిటీస్ ద్వారా ఇంగ్లీష్ నేర్పించడం జరిగిందని, ఇంగ్లీష్ మాట్లాడడానికి ఉపాధ్యాయులు బోధన జరిపించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.