మర్పల్లి తై బజార్ వేలం పాట.. ఎప్పుడంటే..?
మర్పల్లి గ్రామ పంచాయతీ తైబజార్ వేలంపాట కార్యక్రమాన్ని మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించనున్నట్లు స్థానిక పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంత్ ఓ ప్రకటనలో తెలిపారు.

దిశ, మర్పల్లి: మర్పల్లి గ్రామ పంచాయతీ తైబజార్ వేలంపాట కార్యక్రమాన్ని మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించనున్నట్లు స్థానిక పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంత్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల వారు ఉదయం 10 గంటలకు రూ. 1 వెయ్యి రూపాయలు చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. పేరు నమోదు చేసుకున్న వారు మాత్రమే వేలం పాట పాడేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ వేలం పాట లో ఎక్కువ ఎవరికి పాడితే వారికి టై బజార్లు ఇవ్వడం జరుగుతుందని,టై బజార్ లో ఎక్కువగా పాడిన వారు డబ్బులు అప్పుడే చెల్లించాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు.టై బజార్ దక్కించుకున్న వారు ఏడాది పాటు రవాణా, సంతలో వ్యాపారుల వద్ద డబ్బులు వసూలు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు.