నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నోటిఫికేషన్‌పై మంత్రి కీలక ప్రకటన

నిరుద్యోగులకు మంత్రి దామోదర్ రాజనర్సింహా(Damodar Raja Narasimha) శుభవార్త చెప్పారు. వైద్యారోగ్య శాఖ(Health Department)లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వేస్తామని ప్రకటించారు.

Update: 2025-03-22 14:14 GMT
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నోటిఫికేషన్‌పై మంత్రి కీలక ప్రకటన
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు మంత్రి దామోదర్ రాజనర్సింహా(Damodar Raja Narasimha) శుభవార్త చెప్పారు. వైద్యారోగ్య శాఖ(Health Department)లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వేస్తామని ప్రకటించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మరో 50 డయాలసిస్ సెంటర్లు అవసరమని అభిప్రాయపడ్డారు. ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనానికి త్వరలో టెండర్లు పిలుస్తామని అన్నారు. విజన్‌తోనే ముందడుగు వేస్తున్నామని అన్నారు. వచ్చే మే నెలలో ఉద్యోగాల భర్తీ చేస్తామని.. వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహా ప్రకటించారు.

కాగా, ఇటీవలే ఉస్మానియా ఆసుపత్రి (Osmania Hospital) భవనానికి ముఖమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, ఇతర మంత్రులతో కలిసి ఆసుపత్రి నిర్మాణానికి సీఎం భూమిపూజ చేశారు. ప్రస్తుతం ఆసుపత్రి అఫ్జల్‌గంజ్‌లో ఉండగా.. నూతన భవనాన్ని గోషామహల్‌ స్టేడియం(Goshamahal Stadium)లో నిర్మిస్తున్నారు. 2 వేల పడకల సామర్థ్యంతో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త భవనం రానుంది. 5 భాగాలుగా నిర్మాణం జరుగుతుంది. 100% ఉచితంగా అన్ని రకాల సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి ప్రకటించారు. నిర్మాణానికి రూ.2700 కోట్లు ఖర్చు అవుతుందని.. రెండేళ్లలోనే నిర్మాణం పూర్తిచేయాలని కంకణం కట్టుకున్నారు.

Tags:    

Similar News