బడ్జెట్ ప్రసంగమా? రాజకీయ ప్రసంగమా? : మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి

అసెంబ్లీ సాక్షిగా అబద్ధాల చిట్టా చదివారు. ఇది బడ్జెట్ ప్రసంగమా? రాజకీయ ప్రసంగమా? పదేళ్ల బీఆర్ఎస్ పాలనా వికాసాన్ని15 నెలల కాంగ్రెస్ పాలనలో విధ్వంసం చేశారు.

Update: 2025-03-19 16:51 GMT
బడ్జెట్ ప్రసంగమా? రాజకీయ ప్రసంగమా? : మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ సాక్షిగా అబద్ధాల చిట్టా చదివారు. ఇది బడ్జెట్ ప్రసంగమా? రాజకీయ ప్రసంగమా? పదేళ్ల బీఆర్ఎస్ పాలనా వికాసాన్ని15 నెలల కాంగ్రెస్ పాలనలో విధ్వంసం చేశారు. అజ్ఞానం, అనుభవరాహిత్యం, అహంకారం వెరసి తెలంగాణలో ప్రస్తుతం ఇదే తీరులో పాలన నడుస్తున్నది. రెండేళ్ల పాలన పూర్తికాక ముందే తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారు. 2050 తెలంగాణ రైజింగ్ ప్రణాళిక తయారు చేస్తున్నామని చెప్పడం హాస్యాస్పదం. పదేళ్లలో పచ్చబడ్డ తెలంగాణను ఎండబెట్టి కాంగ్రెస్ చోద్యం చూస్తున్నది. పల్లెప్రగతితో పల్లెలు, పట్టణ ప్రగతితో కళకళలాడిన పల్లెలు, పట్టణాలు నేడు పారిశుధ్యం లోపించి కంపుకొడుతున్నాయి. హరితహారం మొక్కలు నీళ్లు పోసే దిక్కు లేక ఎండిపోతున్నాయి. విశ్వవిద్యాలయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కర్ఫ్యూ పరిస్థితి తీసుకువచ్చింది. ఎకరాకు ఏడాదికి రూ.15 వేల రైతుభరోసా అని చెప్పి 15 నెలల పాలనలో రెండు సార్లు ఎగ్గొట్టి రూ.12 వేలకు కుదించారు.

Tags:    

Similar News