మున్నేరుపై తీగల వంతెనకు సర్కార్ గ్రీన్ సిగ్నల్..! కీలక జీవో జారీ
ఖమ్మం సిగలో మరో మణిహారం అయిన మున్నేరుపై తీగల వంతెన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం జీఓను విడుదల చేసింది.
దిశ ఖమ్మం సిటీ : హైదరాబాద్ తరువాత అంతటి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగర సిగలో మరో మణిహారం అయిన మున్నేరుపై తీగల వంతెన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం జీఓను విడుదల చేసింది. ఖమ్మం మున్నేరుపై రూ.180 కోట్లతో నిర్మించనున్న తీగల వంతెనకు సంబందించి రాష్ట్ర ప్రభుత్వం ఈపీసి టెండర్‌ను ఖరారు చేస్తూ జీఓ నెం.90 ను జారీ చేసింది. ఇందుకు గాను ఆయా టెండర్‌ను అప్రూవ్ చేయడానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది.
కన్వీనర్‌గా పి. రవీందర్ రెడ్డి, ఈఎన్‌సి (ఆర్ అండ్ బి), కో కన్వీనర్‌గా గణపతి రెడ్డి, ఈఎన్‌సి (ఆర్ అండ్‌బి), సభ్యులుగా పి. సతీష్ సిఈ (ఆర్‌అండ్‌బి), పి. మధుసుధన్ రెడ్డి, సీఈ (ఆర్‌అండ్‌బి)లను నియమించింది. మొత్తం 420 మీటర్ల పొడవైన ఈ బిడ్జి నిర్మాణంలో 300మీటర్ల తీగల వంతెన ఉంటుందని, హైదరాబాద్‌లోని దుర్గంచెరువు తీగల వంతెన నమూనాలో ఈ బ్రిడ్జి నిర్మాణం జరగబోతుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.
హైదరాబాద్ దుర్గంచెరువుపై నిర్మించిన హైలెవల్ తీగల వంతెన తరహాలో ఖమ్మం మున్నేటిపైనా కొత్త వంతెన నిర్మాణ పనుల త్వరలో ప్రారంభం కానున్నాయని అన్నారు. నిర్మాణ పనులకు గాను టెండర్ కోసం జీవోను జారీ చేయడం పట్ల ఖమ్మం ప్రజల తరుపున ముఖ్యమంత్రి కేసీఅర్ మంత్రి పువ్వాడ కృతజ్ఞతలు తెలిపారు.