Ponnam: క్రీస్తు భోదనలు ఒక్క మతానికి చెందినవే కాదు.. మంత్రి పొన్నం ఆసక్తికర ట్వీట్
క్రీస్తు భోదనలు ఏదో ఒక్క మతానికి చెందినవే కాదని, అందరూ ఆచరించదగినవి అని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు.
దిశ, వెబ్ డెస్క్: క్రీస్తు భోదనలు ఏదో ఒక్క మతానికి చెందినవే కాదని, అందరూ ఆచరించదగినవి అని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. క్రిస్మస్(Christmas) సందర్భంగా ప్రజలకు మంత్రి పొన్నం విషెస్(wishing) చెబుతూ.. ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని కోరుకున్నారు. అంతేగాక మార్గదర్శకత్వం చేసిన ఏసు క్రీస్తు జన్మదినం(Birth of Jesus Christ) సందర్భంగా అందరూ బాగుండాలని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అన్నీ కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ.. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు(Merry Christmas) తెలిపారు.
దీనిపై ఆయన.. క్రిస్మస్ పండగ శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, మానవత్వం చాటే పవిత్రమైన పండగ అని, ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు విరజిల్లుతూ సంతోషం, శాంతి నింపాలని కోరుకున్నారు. అలాగే క్రీస్తు బోధనలు ఆచరణీయం అని, శాంతి సందేశం కోసం దైవ దూతగా వచ్చి ఏసుక్రీస్తు మానవాళి కోసం రక్తం చిందించారని తెలిపారు. ఆయన బోధనలు కేవలం ఏదో ఒక మతానికి మాత్రమే సంబంధించినవి కావని, యావత్తు మానవాళికి మేలు చేసేవి అని చెప్పారు. ప్రేమకు, అభిమానానికి, సహనానికి, దయా, కరుణకు మూర్తీభవించిన రూపమే జీసస్ అని చెబుతూ.. ఏసుక్రీస్తు సందేశాన్ని ప్రతి ఒక్కరు పాటించాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు.