విద్యుదాఘాతానికి గురైన పారిశుద్ధ్య కార్మికుడు!
ఓ పారిశుద్ధ్య కార్మికుడు మంగళవారం వేకువ జామున విధి నిర్వహణలో ఉండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు.
దిశ, గోదావరి ఖని: రామగుండం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఓ పారిశుద్ధ్య కార్మికుడు మంగళవారం వేకువ జామున విధి నిర్వహణలో ఉండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. తోటి కార్మికులు గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి క్షీణించడంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు. కరెంట్ షాక్‌కు గురైన పారిశుద్ధ్య కార్మికుడికి నగర పాలక సంస్థ తరపున కరీంనగర్‌లో మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు రామగుండం నగర పాలక సంస్థ మేయర్ బంగి అనిల్ కుమార్, కమీషనర్ బి.సుమన్ రావు తెలిపారు. గాయపడిన పారిశుధ్య కార్మికుడిని అపోలో రీచ్ ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపారు. ఆసుపత్రిలో చేరిన కార్మికుడిని కమీషనర్ బి.సుమన్ రావు పరామర్శించారు. మేయర్ బంగి అనిల్ కుమార్ వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి, మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
Also Read..