TG Assembly: ‘ధరణి’కి అప్పుడే నూరేళ్లు నిండాయి.. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి సెటైర్లు
బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) 2020లో తీసుకొచ్చిన ‘ధరణి’ (Dharani)కి అప్పుడే నూరేళ్లు నిండాయంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) అసెంబ్లీ (Assembly)లో సెటైర్లు వేశారు.
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) 2020లో తీసుకొచ్చిన ‘ధరణి’ (Dharani)కి అప్పుడే నూరేళ్లు నిండాయంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) అసెంబ్లీ (Assembly)లో సెటైర్లు వేశారు. ఇవాళ భూ భారతి బిల్లు (Bhu Bharathi Bill)పై చర్చ సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ.. ఇవాళ సభలో బీఆర్ఎస్ (BRS) సభ్యులు వ్యవహరించిన తీరు చాలా బాధకరమని అన్నారు. ఓ దళిత స్పీకర్‌ను ప్రధాన ప్రతిపక్షం అవమానించడం తగదని ఫైర్ అయ్యారు. ఎలాగైనా సభలో భూ భారతి చట్టం (Bhu Bharathi Bill)పై చర్చ జరగకుండా బీఆర్ఎస్ పార్టీ (BRS Party) కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ధరణి (Dharani)లో జరిగిన తప్పులు రాష్ట్రం అంతా తెలుసని అన్నారు. వాళ్ల జాగీర్ పార్టీలో ఉన్న తనకు గతంలో టికెట్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. నేడు ప్రజల ఆశీస్సులతో భూ భారతి చట్టాన్ని సభలో ప్రవేశపెట్టే అవకాశం లభించిందని అన్నారు. 80 వేల పుస్తకాలు చదివినోళ్లు సభకు వచ్చి సలహాలు ఇస్తారని అనుకున్నామని తెలిపారు. కానీ, ప్రతిపక్ష నాయకుడు సభకు ఎందుకు రావడం లేదో తెలియడం లేదని మంత్రి పొంగులేటి అన్నారు.