CM Revanth:అసెంబ్లీలో గందరగోళం పై సీఎం రేవంత్ రెడ్డి ఆరా

రాష్ట్రంలో ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు (Assembly Sessions) కొనసాగుతున్నాయి.

Update: 2024-12-20 06:06 GMT

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు (Assembly Sessions) కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఫార్మూలా-ఈ కారు రేసు(Formula -E Car Race)పై చర్చకు బీఆర్ఎస్(BRS) సభ్యులు పట్టుబట్టారు. దీంతో అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ అసెంబ్లీని పదిహేను నిమిషాలు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో గందరగోళం నెలకొనగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) సభలో పరిస్థితిపై ఆరా తీశారు. మంత్రులు శ్రీధర్ బాబు(Minister Sridhar Babu), పొంగులేటితో(Minister Ponguleti Srinivas) మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా సభ ప్రారంభం కాగానే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పేపర్లు చింపి స్పీకర్ పై వేశారని కాంగ్రెస్(Congress) మండిపడింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే తమను అగౌరవపరిచారని బీఆర్‌ఎస్(BRS) ఆగ్రహం వ్యక్తం చేయగా, సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Tags:    

Similar News