AG Sudarshan Reddy: ఇది అత్యవసర పిటిషన్‌ విచారణ కాదు

కేటీఆర్(KTR) క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ప్రభుత్వ తరపు లాయర్, కేటీఆర్ తరపు లాయర్లు కీలక వాదనలు వినిపించారు.

Update: 2024-12-20 12:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేటీఆర్(KTR) క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ప్రభుత్వ తరపు లాయర్, కేటీఆర్ తరపు లాయర్లు కీలక వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్‌(FIR)ను క్వాష్ చేయాలని కేటీఆర్ తరఫు లాయర్ కోరగా.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొదని కోరిన ప్రభుత్వ తరఫు లాయర్ కోరారు. ప్రొసీడింగ్స్‌లో స్టే విధించినప్పుడు.. అరెస్టుపై కూడా స్టే విధించాలని కేటీఆర్ తరఫు లాయర్ వాదించారు. ఫార్ములా ఈ-రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ(ACB) కేసు నమోదు చేసింది. ఇది అత్యవసర పిటిషన్‌ విచారణ కాదు.. FEOకు డబ్బుల చెల్లింపులో అక్రమాలు జరిగాయి.. HMDA ఇందులో భాగస్వామి కాకున్నా రూ.55 కోట్లు చెల్లించిందని ప్రభుత్వ తరపు లాయర్ ఏజీ సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇందులో కేటీఆర్‌కు ఎలాంటి లబ్ధి చేకూరింది అని ఏజీని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎవరెవరికి ఎలాంటి లద్ధి చేకూరిందనేది దర్యాప్తులో తేలుతుందన్న ఏజీ సమాధానం చెప్పారు. కేటీఆర్ ఆదేశాలతోనే.. అగ్రిమెంట్ లేకుండా థర్డ్ పార్టీకి ప్రభుత్వ నిధులు చెల్లించారు. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌కు చెప్పకుండానే చెల్లింపులు చేశారు. ప్రభుత్వానికి ఎన్ని కోట్ల నష్టం వచ్చిందో.. విచారణ జరిగాకే తెలుస్తుంది. ప్రాథమిక దర్యాప్తును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. గవర్నర్ అనుమతి ఇచ్చాకే ఎఫ్ఐఆర్ నమోదు చేశామరని ప్రభుత్వ తరఫు లాయర్ ఏజీ వాదనలు చేశారు.

Tags:    

Similar News