BJP: కాంగ్రెస్ అంబేద్కర్‌ను నిరంతరం అవమానించింది.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
డా. బీఆర్ అంబేద్కర్(Dr. BR Ambedkar) విషయంలో గత కొద్ది రోజులుగా ఢిల్లీ(Delhi)లోని అధికార, ప్రతిపక్షాల మధ్య వార్ నడుస్తోంది.
దిశ, వెబ్ డెస్క్: డా. బీఆర్ అంబేద్కర్(Dr. BR Ambedkar) విషయంలో గత కొద్ది రోజులుగా ఢిల్లీ(Delhi)లోని అధికార, ప్రతిపక్షాల మధ్య వార్ నడుస్తోంది. బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర బొగ్గు, గణుల శాఖమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) సంచలన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ చీకటి చరిత్ర.. అంబేద్కర్ ను అవమానిస్తే భారతదేశం సహించదు అని.. ప్రత్యేక పోస్ట్ పెట్టారు. దీనిపై ఆయన.. కాంగ్రెస్ నిరంతరం అంబేద్కర్ ను అవమానించిందని, బీజేపీ అన్నివేళలా అంబేద్కర్ ను గౌరవించిందని అన్నారు. అలాగే అంబేద్కర్ జీవించి ఉన్నంత వరకు, అంబేద్కర్ మరణించిన తరువాత కూడా వారిని అవమానించడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా కాంగ్రెస్ వారిని అవమానించిందని ఆరోపించారు. ఇక అంబేద్కర్ జీవించి ఉన్నప్పుడు, వారు మరణించిన తరువాత అన్ని వేళలా బీజేపీ వారితో ఉందని, వారితో అనుబంధం ఉన్న 5 ప్రదేశాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేసిందని చెప్పుకొచ్చారు.