TG Assembly: అసెంబ్లీ చరిత్రలో ఇవాళ చీకటి రోజు.. ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన వ్యాఖ్యలు

అసెంబ్లీ (Assembly) చరిత్రలోనే ఇవాళ చీకటి రోజని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (MLA Vemula Veeresham) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-12-20 05:42 GMT
TG Assembly: అసెంబ్లీ చరిత్రలో ఇవాళ చీకటి రోజు.. ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ (Assembly) చరిత్రలోనే ఇవాళ చీకటి రోజని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (MLA Vemula Veeresham) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ (Assembly Media Point) వద్ద మాట్లాడుతూ.. ఎలాగైనా సభ నుంచి బయటకు రావాలని అన్నట్లుగా బీఆర్ఎస్ (BRS) వ్యవహరిస్తోందని ఆరోపించారు. చర్చ జరగకుండా సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. దళితుడైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ (Speaker Gaddam Prasad Kumar)ను బీఆర్ఎస్‌ (BRS) పార్టీ పదే పదే అవమానిస్తోందని అన్నారు.

బీఆర్ఎస్ (BRS) సభ్యుల కోతి చేష్టలను తెలంగాణ సమాజం గమనిస్తోందని అన్నారు. గతంలో వెల్‌లోకి రాకూడదు, పెపర్లు విసరకూడదని బీఆర్ఎస్ పార్టీయే రూల్స్ పెట్టిందని గుర్తు చేశారు. నేడు వెల్‌లోకి వచ్చి స్పీకర్‌పై పేపర్లు విసిరిన ఆ పార్టీ సభ్యులను ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పాలని ప్రశ్నించారు. ధరణి (Dharani) పేరుతో ఓ సామాజికవర్గం పెద్ద ఎత్తున రాష్ట్రంలో భూములను కొల్లగొట్టిందని ఆరోపించారు. అయితే, ఆ భూ దోపిడీ నేడు బయటపడుతోందనే బీఆర్ఎస్ పార్టీ (BRS Party) డ్రామాలు ఆడుతోందని వేముల విరేశం అన్నారు.  

Tags:    

Similar News