Harish Rao : ఆటో కార్మికుల అరెస్టుపై హరీష్ రావు ఫైర్
ఛలో అసెంబ్లీ(Chalo Assembly)కి పిలుపునిచ్చిన ఆటో కార్మికుల(Auto workers)ను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టు(Arrests)లు చేయడాన్ని మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao) ఎక్స్ వేదికగా తీవ్రంగా ఖండించారు.
దిశ, వెబ్ డెస్క్ : ఛలో అసెంబ్లీ(Chalo Assembly)కి పిలుపునిచ్చిన ఆటో కార్మికుల(Auto workers)ను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టు(Arrests)లు చేయడాన్ని మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao) ఎక్స్ వేదికగా తీవ్రంగా ఖండించారు. అభయహస్తం మ్యానిఫెస్టోలో ప్రతి ఆటో డ్రైవర్ కు ఏడాదికి 12 వేల ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్ల బోర్డు ఏర్పాటు చేసి, సామాజిక భద్రత కల్పిస్తామన్నారని హరీష్ రావు గుర్తు చేశారు.
ఏడాది కాలం పూర్తయినా కాంగ్రెస్ హామీలకు అతీ గతీ లేదని మండిపడ్డారు. ఆటో సోదరులకు మీరు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, అరెస్టులు చేసిన ఆటో డ్రైవర్లను తక్షణం విడుదల చేయాలని బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు.