Assembly : విపక్షాల వాయిదా తీర్మానాల తిరస్కరణ..సభ రేపటికి వాయిదా
అసెంబ్లీ(Assembly)లో ప్రతిపక్షాలు(Opposition's ) ఇచ్చిన వాయిదా తీర్మానాల(Adjournment motion)ను స్పీకర్ గడ్డం ప్రసాద్ తిరస్కరించారు
దిశ, వెబ్ డెస్క్ : అసెంబ్లీ(Assembly)లో ప్రతిపక్షాలు(Opposition's ) ఇచ్చిన వాయిదా తీర్మానాల(Adjournment motion)ను స్పీకర్ గడ్డం ప్రసాద్ తిరస్కరించారు(Rejected). ఫార్ములా ఈ రేసు కేసుపై చర్చించాలంటూ బీఆర్ఎస్ సభ్యుడు హరీష్ రావు ఇచ్చిన వాయిదా తీర్మానంతో పాటు బీజేపీ, సీపీఐ ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించారు. నిరుద్యోగ భృతిపై చర్చకు బీజేఎల్పీ నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని, కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానంపై చర్చించాలంటూ సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. భూ భారతి బిల్లు ఆమోదం అనంతరం సభను రేపు ఉదయం 10గంటలకు వాయిదా వేస్తున్నట్టుగా స్పీకర్ ప్రకటించారు.