VC Sajjanar:‘చూశారా.. ఎంతకు తెగిస్తున్నారో!’.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తోన్న ఇన్‌ఫ్లుయెన్సర్లపై సజ్జనార్ ఫైర్

ఇటీవల కాలంలో యువత ఆన్‌లైన్ బెట్టింగ్(Online Betting) మోజులో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు

Update: 2024-12-19 10:53 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో యువత ఆన్‌లైన్ బెట్టింగ్(Online Betting) మోజులో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో లోన్ యాప్‌ల వేధింపులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఈ ఆన్‌లైన్ బెట్టింగ్స్ యాప్స్ పై TGRTC ఛైర్మన్ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బెట్టింగ్ యాప్స్ వలలో పడి అమాయకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్ల ఆలోచన మారట్లేదని మండిపడ్డారు.

ఈజీగా మనీ సంపాదించొచ్చని నమ్మించి ఫాలోవర్లను వలలో వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబర్‌పై టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఫైర్ అయ్యారు. ‘చూశారా ఎంతకు తెగిస్తున్నారో’ తమ వ్యక్తిగత స్వార్థం కోసం అమాయకులను బెట్టింగ్ కూపంలోకి లాగి బలి చేస్తున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘యువ‌కుల్లారా!! అరచేతిలో వైకుంఠం చూపించే ఇలాంటి సంఘవిద్రోహ శ‌క్తుల వలలో చిక్కుకోకండి. బెట్టింగ్ కు బానిసై బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోకండి’’ అని ఆయన ట్వీట్ చేశారు.

Tags:    

Similar News