TG Assembly: అప్పులు చేయకుండా బ్యాంకుల్లో చోరీ చేయాలా? అసెంబ్లీలో ఎమ్మెల్యే కూనంనేని ఫైర్
రూ. లక్షల కోట్లు అప్పు చేస్తే.. ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: రూ. లక్షల కోట్లు అప్పు చేస్తే.. ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni Sambasiva Rao) ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఇవాళ (TG Assembly) అసెంబ్లీలో మాట్లాడారు. పేదవాడు జీఎస్టీ రూ.18 లక్షల కోట్లు కడుతుంటే.. ధనికులు కేవలం 3 శాతమే కడుతున్నారని చెప్పారు. తిరిగి డబ్బు వ్యాపారస్తులు, రియల్‌ఎస్టేట్, అదాని, అంబానీలకు రాయితీలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఖర్చు పెట్టే రూపాయిలో పావలా కూడా న్యాయబద్ధంగా ఖర్చు అవ్వడం లేని నాడు రాజీవ్‌గాంధీ చెప్పిన మాటాలు గుర్తుకు చేశారు.
అంత అవినీతి మయంగా డబ్బుల లెక్కలు కుప్పలు కుప్పలుగా కనబడుతుంటే.. ఇది దేశ, రాష్ట్ర ప్రజలకు మంచిది కాదన్నారు. ఒకవైపు మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పే లెక్కలు, డిప్యూటీ సీఎం చెప్పిన లెక్కల్లో తేడా ఉందన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను ఎవరు తీర్చాలని నిలదీశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, పెండింగ్ బకాయిలు చెల్లించాలంటే డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలని ప్రశ్నించారు. అప్పు చేయకుండా బ్యాంకుల్లో చోరీ చేయాలా? అని ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా అప్పులు చేయాలని, ప్రభుత్వాన్ని నడపాలని సూచించారు.