CM Revanth Reddy: గూగుల్ లో వచ్చిందే నిజమనుకుంటున్నారు: సీఎం రేవంత్ రెడ్డి

37వ బుక్ ఫెయిర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

Update: 2024-12-19 13:36 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే రోజుల్లో బుక్ ఫెయిర్ లాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ (37 Hyderabad Book Fair)ను ఇవాళ ఆయన ప్రారంభించారు. బుక్ స్టాల్స్‌ను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రస్తుత డిజిటల్ యుగంలో పుస్తకాల ప్రాధాన్యత తగ్గుతోందని చెప్పారు. ఈ క్రమంలో భావి తరానికి స్ఫూర్తినివ్వాలని బుక్ ఫెయిర్ నిర్వహించడం అభినందనీయం అన్నారు. మనం చరిత్ర చదువుకుంటేనే భవిష్యత్‌కు సరైన మార్గాన్ని నిర్దేశించుకోవచ్చని నేటి తరానికి చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

‘దిశ’ స్టాల్ ఏర్పాటు

ఈ బుక్ ఫెయిర్‌లో 337 స్టాల్ వద్ద దిశ దినపత్రిక (Disha Book Stall) సైతం స్టాల్ ఏర్పాటు చేసింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 29 వరకు ఈ బుక్ ఫెయిర్ కొనసాగనున్నది. ఇక్కడ మొత్తం 350 స్టాల్స్ ఏర్పాటు చేశారు. బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణరావు, ఎమ్మెల్సీ కోదండరామ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, హెచ్‌బీఎఫ్ అధ్యక్షుడు డా.యాకూబ్ షేక్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News