‘నా వెంట్రుక కూడా పీకలేరు’.. రెచ్చిపోయిన KTR

తనపై నమోదైన కేసులపై కేటీఆర్(KTR) మరోసారి స్పందించారు. గురువారం తెలంగాణ భవన్‌(Telangana Bhavan)లో మీడియాతో మాట్లాడారు.

Update: 2024-12-19 15:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: తనపై నమోదైన కేసులపై కేటీఆర్(KTR) మరోసారి స్పందించారు. గురువారం తెలంగాణ భవన్‌(Telangana Bhavan)లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) పెట్టే చిల్లర కేసులను ఎవరు భయపడరు. న్యాయపరంగానే కొట్లాడుతాం. ఇంకెన్ని కేసులు పెట్టాలనుకుంటున్నారో పెట్టుకోండి. అంతేకాని ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ పరువు తీయొద్దు. ఫార్ములా-ఈరేసు కేసుతో తెలంగాణ పరువు పోతోందని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని మరోసారి డిమాండ్ చేశారు.

‘తాను తప్పు చేశానని అసెంబ్లీ సాక్షిగా నిరూపించండి. వాస్తవాలు ఏంటో తెలంగాణ ప్రజలకు తాను కూడా చెబుతాను. అసలు ముందు కేసు పెట్టాల్సింది రేవంత్ రెడ్డి మీదనే. అంతటి ప్రఖ్యాత రేసింగ్ దేశానికి రాకపోవడానికి రేవంత్ రెడ్డే కారణం. తనపై నమోదు చేసిన కేసులో అసలు అవినీతే లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి. నా వెంట్రుక కూడా పీకలేరు. నేను ఏ తప్పూ చేయలేదు. అందుకే ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నాను. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఓఆర్ఆర్ టెండర్ రద్దు చేయాలి’ అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News