ACB: కేటీఆర్‌పై నమోదైన FIRలో కీలక అంశాలు
బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)పై నమోదైన FIRలో ఏసీబీ అధికారులు కీలక అంశాలు ప్రస్తావించారు.
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)పై నమోదైన FIRలో ఏసీబీ అధికారులు కీలక అంశాలు ప్రస్తావించారు. హిమాయత్‌నగర్(Himayatnagar)లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(Indian Overseas Bank) నుంచి ఎఫ్‌ఈవోకు నిధులు బదలాయించినట్టు గుర్తించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఈసీ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా HMDAకి చెందిన రూ.54.88 కోట్లు దుర్వినియోగం చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాదు.. ‘ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అనుమతి తీసుకోకుండా HMDA నిధులు వినియోగించారు. చెల్లింపుల తర్వాత అగ్రిమెంట్ చేసుకున్నారు. ఫారిన్ ఎక్స్ఛేంజ్ నిబంధనలు ఉల్లంఘించారు. 5 అంశాల్లో అక్రమాలు జరిగినట్టు దానకిషోర్ ఫిర్యాదు’ చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.