Formula-E Car Race: విచారణకు ప్రత్యేక బృందం ఏర్పాటు
ఫార్ములా ఈ-కార్ రేసు(Formula E-Car Race Case) వ్యవహారంలో బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)పై కేసు నమోదైన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-కార్ రేసు(Formula E-Car Race Case) వ్యవహారంలో బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)పై కేసు నమోదైన విషయం తెలిసిందే. కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అలాగే ప్రైవేట్ కంపెనీ సీఈవో బీఎల్ఎన్ రెడ్డి పైనా కూడా కేసు నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ ఏసీబీ(ACB) ఆఫీస్‌లో ఏసీబీ డీజీ విజయ్ కుమార్(ACB DG Vijay Kumar) అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు.
ఫార్ములా ఈ-కార్ రేసు కేసు విచారణ కోసం ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిని పేర్కొన్నారు. ఈ కేసులో కేటీఆర్‌తో పాటు మరో ఇద్దరికి నోటీసులు జారీ అనంతరం అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ముగ్గురి విచారణ తర్వాత విదేశీ కంపెనీకి కూడా నోటీసులు పంపే అవకాశం ఉన్నట్లు సమాచారం.