BJP MLA: తెలంగాణ శ్రీలంకలా మారే ప్రమాదం

బీఆర్ఎస్(BRS) బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) నడుస్తోందని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Maheshwar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-12-19 13:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) నడుస్తోందని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Maheshwar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ. లక్షా 27 వేల కోట్ల అప్పు ఎలా చేశారని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. ఎఫ్‌ఆర్‌‌బీఎమ్(FRBM) పరిధిలో లేకుండా అప్పు చేశారని అన్నారు. అప్పులు చేసి కూడా హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. కమీషన్ల కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. అతి త్వరలో తెలంగాణ శ్రీలంకలా మారబోతోందని కీలక వ్యాఖ్యలు చేశారు.

అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్ ముట్టడిపై బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. స్వయంగా సీఎం రాజ్‌భవన్ ముట్టడికి వెళ్లడం రాజ్యాంగాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు. సాధారణంగా కాంగ్రెస్ ఎల్పీ నేత అధ్యక్షతన ధర్నాలో పాల్గొంటారని, కానీ సీఎం స్వయంగా వెల్లడమేంటని ప్రశ్నించారు. అదానీతో దోస్తీ చేసి రూ.100 కోట్లు తెచ్చుకున్నారని, రాహుల్ గాంధీ వద్దంటే వెనక్కు ఇచ్చారన్నారు. సీఎం పదవిని కాపాడుకునేందకు ధర్నా డ్రామా మొదలు పెట్టారని విమర్శించారు. రాహుల్ అపాయింట్ మెంట్ ఇవ్వనందుకే రేవంత్ ఇలా చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News