రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇస్తారో తెలుసా..?

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే రైతులకు రైతు భరోసా అందించేందుకు సిద్ధం అవుతుంది.

Update: 2024-12-16 05:20 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt).. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే రైతులకు రైతు భరోసా(Raithu barosa) అందించేందుకు సిద్ధం అవుతుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సహా.. కీలక మంత్రులు సంక్రాంతి పండుగ నుంచి రైతు భరోసా అందిస్తామని చెప్పుకొస్తున్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూమి ఉన్న ప్రతి రైతుకు రైతుబంధు అందించింది. కాగా ఈ విధానం పై తీవ్ర స్థాయిలో విమర్శలు రాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలనే వివిధ రకాల సందేహాలపై కేబినెట్ సబ్ కమిటీ(Cabinet Sub Committee) వేసింది. కాగా ఈ కమిటీ అన్ని వర్గాల నుంచి సలహాలు సూచనలను తీసుకొని.. రైతు భరోసా 7 నుంచి 10 ఎకరాల లోపు లిమిట్ పెట్టాలని సూచించినట్లు తెలుస్తోంది.

రైతు భరోసాపై ఖచ్చితమైన లిమిట్(Limit) పెట్టాలని చాలా మంది విశ్లేషకులు సూచించినట్లు తెలస్తుంది. అలాగే ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారికి IAS, IPS అధికారులకు సైతం రైతు భరోసా ఇవ్వకూడదని.. కేబినెట్ సబ్ కమిటీ(Cabinet Sub Committee).. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం అందుతుంది. కాగా రైతు భరోసాపై కమిటీ అందించిన నివేదికపై అసెంబ్లీ, కేబినెట్ భేటీలో చర్చించి.. రైతు భరోసా అమలుపై విధి విధానాలను రూపొందించనున్నట్లు తెలుస్తుంది. కాగా ప్రభుత్వ హామీ ప్రకారం ఈ రైతు భరోసా పథకం కింద.. ప్రతి రైతుకు సీజన్ కు ఒక సారి ఎకరాకు రూ. 7500 ఇవ్వనున్నారు. ఇది రైతులకు ముందస్తుగా పెట్టుబడిగా ఉపయోగపడుతుంది.

Tags:    

Similar News