తెలంగాణలోని ప్రతీ గుండెలో నిరాశ ఉంది: RSP
రాష్ట్ర ఐఏఎస్ అధికారుల్లో అసంతృప్తి రగులుతోందా? ముఖ్యంగా బడుగు బలహీన ఐఏఎస్ అధికారులు తీవ్ర అసహనం, ఆవేదనలో ఉన్నారా?
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ఐఏఎస్ అధికారుల్లో అసంతృప్తి రగులుతోందా? ముఖ్యంగా బడుగు బలహీన ఐఏఎస్ అధికారులు తీవ్ర అసహనం, ఆవేదనలో ఉన్నారా? తెలంగాణ వచ్చినా తమకు ప్రాధాన్యత లభించడం లేదన్న ఆక్రోశంలో ఉన్నారా? అంటే బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అవుననే అంటున్నారు. రాష్ట్ర ఐఏఎస్‌ల సమస్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్‌పై విమర్శలు చేశారు. ''కేవలం ఐఏఎస్‌లోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ గుండెలో నిరాశ గూడుకట్టుకొని ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి కోకాపేట వరకూ ప్రతి చోటా పరాయి పాలనే! ఇవి మనకు తెలవకుండా పత్రికలను ఛానల్స్‌ను పెట్టుకున్నారు మన పాలకులు! సాక్షాత్తు సీఎం దగ్గరనే I & PR ఉన్నది. హిట్లర్- గోబెల్స్ గుర్తుకొస్తలేరూ?'' అంటూ కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కేవలం IAS లోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గుండెలో నిరాశ గూడుకట్టుకొని ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి కోకాపేట వరకూ ప్రతి చోటా పరాయి పాలనే!ఇవి మనకు తెలవకుండా పత్రికలను ఛానల్స్‌ను పెట్టుకున్నారు మన పాలకులు! సాక్షాత్తు CM దగ్గరనే I & PR ఉన్నది. హిట్లర్- గోబెల్స్ గుర్తుకొస్తలేరూ? pic.twitter.com/RE1dPl2oig
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) January 5, 2023