Revanth Reddy: నా ఆలోచన, ఆశయం, ఆచరణ అన్నీ ఆ దిశగానే.. సీఎం ఇంట్రెస్టింగ్ ట్వీట్

నా ఆలోచన, ఆశయం, ఆచరణ అన్నీ ఆ దిశలోనే పయణిస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Update: 2024-09-25 13:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: నా ఆలోచన, ఆశయం, ఆచరణ అన్నీ ఆ దిశలోనే పయణిస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ లోని జేఎన్ఎఫ్ఏయూ‌లో బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్) రంగాలకు అవసరమైన నైపుణ్యాలు నేర్పేందుకు స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్‌ను సీఎం ప్రారంభించాడు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై తెలంగాణ యువతరమా.. నువ్వు నేర్చే అక్షరానికి నైపుణ్యంతో వన్నె తేవాలని, నువ్వు అభ్యసించే డిగ్రీ పట్టా.. నీ భవితకు గ్యారెంటీ ఇవ్వాలనేదే తన తాపత్రయంగా చెప్పారు. నా ఆలోచన, నా ఆశయం, నా ఆచరణ.. ప్రతి అడుగు ఆ దిశగానే సాగుతోందని తెలిపారు. నేడు ప్రారంభిస్తోన్న ఈ బీఎఫ్ఎస్ఐ నైపుణ్య శిక్షణ ఆ దిశగా వేస్తోన్న ఒక అడుగు అని రేవంత్ రెడ్డి అన్నారు.


Similar News