సర్పంచ్‌లు తలుచుకుంటే కేసీఆర్‌ని బొందపెట్టొచ్చు: రేవంత్ రెడ్డి ఫైర్

సర్పంచ్‌ల నిధులను కేసీఆర్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని టీపీసీసీ చీఫ్ రేవండ్ రెడ్డి డిమాండ్ చేశారు.

Update: 2023-01-09 10:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: సర్పంచ్‌ల నిధులను కేసీఆర్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ సర్పంచ్ల సమస్యలు పరిష్కరించాలంటూ ఇవాళ టీ కాంగ్రెస్ ధర్నా చౌక్ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టగా రేవంత్ రెడ్డి హజరై మాట్లాడారు. కాంగ్రెస్ చేపట్టిన ధర్నాకు సర్పంచ్‌ల మద్దుతు ఉందని తెలిపారు. సీఎం కేసీఆర్ సర్పంచ్‌ల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. పంచాయతీ నిధులను కేసీఆర్ ప్రభుత్వం దొంగిలిస్తుందని ఆరోపించారు. కేసీఆర్ తీరుతో సిరిసిల్లలో ఓ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడని.. మునుగోడులో మరో సర్పంచ్ బిక్షం ఎత్తుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సర్పంచ్‌లకు ఆత్మగౌరవం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ భస్మాసురుడిగా మారిపోయారని.. భస్మాసుర హస్తంతో పార్టీ పేరును మార్చుకున్నారని ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్‌ని పొలిమేర్ల నుంచి తరమండని.. రాష్ట్రంలో సర్పంచ్‌లు తలుచుకుంటే కేసీఆర్‌ని బొందపెట్టొచ్చు అని రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. కేసీఆర్ తెచ్చిన చట్టం రద్దు చేస్తామని చెప్పారు. 

Tags:    

Similar News