దొంగ సార, కల్తీ కల్లు అమ్ముకునే వారు కూడా నన్ను విమర్శిస్తారా?.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గద్వాల్ వాళ్లు ఏం చేస్తరో తెలువదా? అని మండిపడ్డారు. దొంగ సార కాసేటోళ్లు, కల్తీ కల్లు అమ్ముకునేటోళ్లు అని మండిపడ్డారు. రోడ్ల కాంట్రాక్టులు ఎవరివని ప్రశ్నించారు. సారాయి దందాలేవరివి అంటూ రేవంత్ రెడ్డి సంచలన ప్రశ్నలు అడిగారు. ఇన్ని దందాలు చేసెటోళ్లు ఇవాళ నన్ను బెదిరించి, నన్ను తప్పని మాట్లాడుతున్నారు అంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు రైతుబంధుపై కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ నెల 8వరకు రైతుబంధు వేస్తే.. ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. ఈనెల 8వ తేదీ నాటికి రైతుభరోసా పూర్తి చేస్తామని చెప్పారు. మొత్తం 69 మంది లక్షల రైతుల్లో ఇప్పటి వరకు 65 లక్షల మంది ఖాతాల్లో రైతబంధు డబ్బులు జమ చేశామని, మిగిలిన నాలుగు లక్షల మందికి ఈ నెల 8 వరకు పూర్తి చేస్తామన్నారు. ఈనెల 9న కేసీఆర్ అమరవీరుల స్థూపం వద్దకు రావాలని, రైతుబంధు పూర్తిగా అమలు చేయకుంటే.. తాను ముక్కు నేలకు రాస్తానని, లేకుంటే కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
Read More..
తెలంగాణకు కేంద్రం రూ.9 లక్షల కోట్లు ఇచ్చింది.. చర్చకు సిద్ధమా? రేవంత్