ప్రతి ఓటరు నిర్భయంగా ఓటు వేయాలి : అడిషనల్ డీసీపీ
గ్రామాల్లోని ప్రతి ఓటరు తప్పనిసరిగా పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి తమ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి అన్నారు.
దిశ,తలకొండపల్లి (కడ్తాల) : గ్రామాల్లోని ప్రతి ఓటరు తప్పనిసరిగా పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి తమ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి అన్నారు. కడ్తాల్ మండలంలోని చెల్లంపల్లి గ్రామంలో సోమవారం రాత్రి గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని ఓటు విలువలను, హక్కులను ప్రజలకు వివరించారు. అసెంబ్లీ ఎన్నిక సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎవరైనా మద్యం డబ్బులు పంపిణీ చేసిన నేరుగా తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ శివప్రసాద్, ఎస్ఐ హరిశంకర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.