Eatala Rajender: ఈటల రాజేందర్‌పై పీహెచ్‌డీ.. పట్టా పొందిన డాక్టర్ ఆంజనేయులు
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై ఓ వ్యక్తి పీహెచ్‌డీ చేశారు. హిస్టరీ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డెవలప్మెంట్ టు తెలంగాణ, కేస్ స్టడీ ఆన్ ఈటల రాజేందర్ పేరుతో ఉస్మానియా యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీలో డాక్టర్ ఆంజనేయులు ముదిరాజ్ పీహెచ్‌డీ పట్టా పొందారు.
దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై ఓ వ్యక్తి పీహెచ్‌డీ చేశారు. హిస్టరీ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డెవలప్మెంట్ టు తెలంగాణ, కేస్ స్టడీ ఆన్ ఈటల రాజేందర్ పేరుతో ఉస్మానియా యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీలో డాక్టర్ ఆంజనేయులు ముదిరాజ్ పీహెచ్‌డీ పట్టా పొందారు. శనివారం షామిర్‌పేటలోని ఈటల నివాసంలో ఆయన్ను కలిసి థీసిస్ పుస్తకాన్ని ఈటల రాజందర్‌కి అందించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ప్రపంచ ప్రజానీకం వణికిపోతున్న సందర్భంలో, బ్రతికితే బలుసాకు తినొచ్చు అని భావించిన కరోనా సమయంలో తాను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశాని అన్నారు. తన ఉద్యమ ప్రస్థానాన్ని, మంత్రిగా పనిచేసిన సమయాన్ని సబ్జెక్ట్ గా ఎంచుకొని డాక్టరేట్ పొందిన ఆంజనేయులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.
ఈటల మానవతా కోణంలో ఆలోచించే వ్యక్తి
డాక్టర్ ఆంజనేయులు మాట్లాడుతూ.. కరోనా సమయంలో ఈటల రాజేందర్ చేసిన సేవలు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రజలకు ఆయన అందించిన ధైర్యం ప్రత్యక్షంగా చూసినవాడిగా ఆయన మీద పీహెచ్‌డీ చేశానని ఆంజనేయులు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన క్రియాశీలకంగా పోరాడారని అన్నారు. మానవతా కోణంలో ఆలోచించే వ్యక్తిని చరిత్ర పుటల్లో ఉంచాలనే ఆలోచనతో ఆయన పేరుమీద ఈ పీహెచ్‌డీ చేయడం జరిగింది.దీనికి సహకరించిన ఉస్మానియా యూనివర్సిటీ, ఆచార్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.